పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దేశంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రులపై అక్రమంగా స్నూపింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కీలక నేతల ఫోన్లపై నిఘా ఉన్నట్టు వార్తలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై దృష్టి సారించాయి. పెగాసస్ వినియోగంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక న్యాయ విచారణ, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే పెగాసస్ వ్యవహారంపై జూలై 22, గురువారం నాడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో భాగంగా చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించి గవర్నర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు.
ప్రతిపక్ష నేతల ఫోన్లపై నిఘాకు నిరసనగా చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ గురువారం ఉదయం ఇందిరా పార్కు వద్ద సమావేశమై, అనంతరం రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రాజ్ భవన్ మార్చ్ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ