తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు

Implementation of Revised Market Values, Implementation of Revised Market Values In Telangana, Implementation of Revised Market Values in the State, Land market value, Land market value stamp duty rates revised in Telangana, Mango News, New Market Values and Stamp Duty Rates, New Market Values and Stamp Duty Rates will be Implemented, New Market Values and Stamp Duty Rates will be Implemented from Today, Revised Market Values and Stamp Duty Rates will be Implemented from Today, Stamp Duty Rates And Registration % Also Increased, telangana, Telangana Govt, Telangana Revised Market Values

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ జూలై 20వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరించిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు నేటి నుంచే (జూలై 22,గురువారం) అమల్లోకి రానున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త ధరలే వర్తించనున్నాయి. ఈమేరకు కార్డ్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్స్ విలువలు, స్టాంప్ డ్యూటీ రేట్లు/రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వ్యవసాయ భూములకు అతి తక్కువ/కనిష్ట విలువను ఎకరాకు రూ.75,000 గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల కోసం కనిష్ఠ శ్రేణిలో (లోయర్ రేంజ్) ఇప్పుడు ఉన్న విలువలు 50%, మధ్య పరిధి(మిడ్ రేంజ్) లో 40% మరియు అధిక పరిధిలో(హైయర్ వ్యాల్యూ)లో 30% పెంచబడ్డాయి. ఇక ఓపెన్‌ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.100 నుంచి రూ.200కు, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.800 నుంచి రూ.1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. జూలై 22 లేదా ఆ తరువాత రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే చెల్లింపులు జరిపి స్లాట్స్ బుక్ చేసుకున్న వారు కొత్త రేట్ల ప్రకారం అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ సహా ఇతర విభాగాల్లో ఇప్పటికే 30,891 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, వీరంతా పెరిగిన విలువల ప్రకారం అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంది. అదనపు చెల్లింపులు చేయడానికి ధరణి పోర్టల్ లో “అడిషనల్ పేమెంట్స్ ఫర్ స్లాట్స్ ఆల్రెడీ బుక్ డ్” అనే మాడ్యూల్ ను అందుబాటులో ఉంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =