దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88.13 లక్షలమందికి పైగా (88,13,919) కరోనా వ్యాక్సిన్ వేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే రోజు వ్యవధిలో అందించిన వ్యాక్సిన్ డోసుల్లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని కూడా దాటింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 55 కోట్లు దాటింది.
దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా, ఆగస్టు 17, మంగళవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 55 కోట్లు (55,47,30,609) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికి 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 22.4%, 45-60 ఏళ్ల వయసు వారికి 32%, 18-44 ఏళ్ల వయసు వారికి 45.6% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలిపారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (ఆగస్టు 17, ఉదయం 7 గంటల వరకు):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,03,50,941
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 81,20,754
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,82,86,002
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,22,44,940
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 20,20,24,963
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 1,61,02,484
- 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 11,87,86,699
- 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 4,64,06,915
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 8,17,46,204
- 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 4,06,60,707
- పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 55,47,30,609
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ