బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై ట్విట్టర్ లో స్పందించిన మంత్రి కేటీఆర్

Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme Issue, Dalit Bandhu Scheme News, KTR Asked People To Apply for Rs 15 lakh in Jan Dhan Accounts, Mango News, Minister KTR, Minister KTR Counter To BJP Leaders Comments, Minister KTR Made A Strong Counter to BJP, Minister KTR Make a Counter to BJP, Minister KTR Strong Counter to BJP Over TRS Dalit Bandhu Scheme, Rs 15 lakh promise, Telangana Minister KTR, What About 15 Lakh In Accounts Promised By PM Modi

రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపడుతున్నామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని బండి సంజయ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన దరఖాస్తుల ఉద్యమం ట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బండి సంజయ్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ, “ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ. 15 లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి తెలంగాణ బీజేపీ తీసుకున్న ఈ చర్యను నేను స్వాగతిస్తున్నాను. ఈ ప్రయోజనాన్ని ధనదాన్ గా వారి జనధన్ ఖాతాలలో పొందడం కోసం అర్హులైన తెలంగాణ వాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాలని కోరుతున్నాను” అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + seven =