ఆఫ్ఘానిస్తాన్ క్రైసిస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రసంగం

Afghanistan Crisis, Afghanistan crisis live updates, Afghanistan Crisis Situation, Afghanistan-Taliban Crisis, Afghanistan-Taliban Crisis Live Updates, America President Joe Biden Addresses the Nation, America President Joe Biden Addresses the Nation on Afghanistan Crisis Situation, Biden defends withdrawal of US troops from Afghanistan, Fall of Kabul, India announces emergency e-visa for Afghans, Mango News, President Biden Remarks on Drawdown in Afghanistan, US President Joe Biden Addresses Nation

ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా వశం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్ లో చోటుచేసుకున్న పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం నాడు వైట్ హౌస్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ వ్యవహారంపై జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని, ఈ నిర్ణయానికి తాను కట్టుబడే ఉన్నట్లు జో బైడెన్ పేర్కొన్నారు. “మేము స్పష్టమైన లక్ష్యాలతోనే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాము. సెప్టెంబర్ 11, 2001న మాపై దాడి చేసిన వారిని పట్టుకోడానికి మరియు అల్ ఖైదా ఆఫ్ఘానిస్తాన్ ను మళ్లీ అమెరికాపై దాడి చేసే స్థావరంగా ఉపయోగించలేదని నిర్ధారించుకోడానికి అక్కడ బలగాలను మోహరించాం. మేము ఇదంతా ఒక దశాబ్దం క్రితం చేశాము. మా లక్ష్యం ఎన్నడూ ఆఫ్ఘాన్ జాతి నిర్మాణం కాదు” అని జో బైడెన్ పేర్కొన్నారు.

“ఆఫ్ఘాన్ లో ఇప్పుడు జరుగుతున్నది ఐదు సంవత్సరాల క్రితం సులభంగా జరిగి ఉండవచ్చు లేదా భవిష్యత్తులో పదిహేను సంవత్సరాల తర్వాత జరగవచ్చు. ఆఫ్ఘానిస్తాన్ లో అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ చేస్తూ నేను తీసుకున్న నిర్ణయం విమర్శించబడుతుందని తెలుసు. కానీ ఈ బాధ్యతను మరొక అధ్యక్షుడికి అప్పగించడం కంటే ఆ విమర్శలన్నింటినీ నేనే స్వీకరిస్తాను. ప్రజలకు, అమెరికా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమెరికా సైనిక ధైర్యవంతులకు ఇది సరైనదని భావిస్తున్నా. ఆఫ్ఘానిస్తాన్ లో ఆఫ్ఘాన్ దళాలే పోరాడటానికి పెద్దగా ఇష్టపడని యుద్ధంలో, అమెరికన్ సైనికులు పోరాడలేరు మరియు వారు చనిపోకూడదు. నేడు ఉగ్రవాద ముప్పు ఆఫ్ఘానిస్తాన్ దాటి విస్తరించింది. అమెరికాకు శాశ్వత సైనిక ఉనికి లేని పలు దేశాలలో తీవ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా మేము సమర్థవంతమైన తీవ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తాము. అవసరమైతే ఆఫ్ఘానిస్తాన్ లో కూడా అదే చేస్తాము. ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా మరియు మిత్రరాజ్యాల పౌర సిబ్బంది తీసుకురావడంలో సహాయం చేయడానికి ఆఫ్ఘానిస్తాన్ లో మోహరించడానికి 6,000 మంది అమెరికా సైనికులకు అధికారం ఇచ్చాను. ఆఫ్ఘాన్ మిత్రదేశాలు మరియు బలహీనమైన ఆఫ్ఘాన్లను దేశం వెలుపలకు సురక్షితంగా తరలించడానికి వారు సహాయపడతారు. ఈ ప్రస్తుత మిలిటరీ మిషన్ సమయం చాలా తక్కువగానే ఉంటుంది, కేవలం ప్రజలను మరియు మిత్రులను సాధ్యమైనంత త్వరగా సురక్షితంగా తరలించడం వంటి లక్ష్యాలపై దృష్టి పెడుతుంది. ఈ మిషన్‌ను పూర్తి చేసిన తర్వాత, మేము మా సైనిక ఉపసంహరణను ముగిస్తాము. అలాగే అమెరికా యొక్క సుదీర్ఘ యుద్ధాన్ని ముగింపు పలుకుతాము” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =