దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 607 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,36,365 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మిజోరాం, వెస్ట్ బెంగాల్, అస్సాం, మణిపూర్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి.
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.63 శాతం:
దేశంలో ప్రస్తుతం 3,33,725 (1.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 34,159 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,17,88,440 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.63 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ఇక ఆగస్టు 25, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 51,31,29,378 కు చేరుకుంది. ఆగస్టు 25న 17,87,283 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ