దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 60 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Covid-19 Vaccination Coverage Crosses, Covid-19 Vaccination Coverage Crosses 60 Crore Mark, COVID-19 Vaccine Tracker, Cumulative COVID-19 vaccination coverage in country, India crosses 60 crore vaccination mark, India’s Cumulative COVID-19 Vaccination, India’s Cumulative Covid-19 Vaccination Coverage Crosses 60 Crore Mark, India’s vaccination tally crosses 60 crore mark, India’s Cumulative Covid-19 Vaccination Coverage, Mango News

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 60 కోట్లు దాటింది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెలలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.

దేశంలో ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా ఆగస్టు 26, గురువారం ఉదయం 8 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 60 కోట్లు (60,38,46,485) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 80 లక్షలమందికి పైగా(80,40,407) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 21.4%, 45-60 ఏళ్ల వయసు వారికి 31.2%, 18-44 ఏళ్ల వయసు వారికి 47.4% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =