తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు మూడు రోజుల పాటుగా ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా సెప్టెంబర్ 1 మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరతారు. సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 3న మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు.
ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన 1300 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలే వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ