ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి, సీఎస్ ఆదేశాలు

Collectors on alert in view of IMD forecast, CS Asks Collectors to be Alert, CS asks officials to be vigilant, CS DGP conducts video conference on Weather conditions, CS Somesh Kumar, DGP Mahender Reddy Held Video Conference with Collectors over Rains, Heavy Rains, Mango News, Somesh Kumar, Telangana CS Somesh Kumar, Telangana Heavy Rains, Telangana rains, Telangana rains live updates, telangana rains news, telangana rains updates

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో బిఆర్కేఆర్ భవన్ నుండి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వాటర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ యన్.సత్యనారాయణ, ఎన్డీఆర్ఎఫ్ దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =