తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 9, గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్, తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ముందుగా సెప్టెంబర్ 2వ తేదీన న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. సెప్టెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా, తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై లేఖలు అందజేయడంతో పాటుగా, ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని కోరారు.
అలాగే సెప్టెంబర్ 4న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో, సెప్టెంబర్ 6న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, లేఖలు అందజేశారు. సెప్టెంబర్ 7న రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై ఢిల్లీ నుంచే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఢిల్లీ పర్యటనను ముగించుకుని నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ