భారత పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ అతిథ్య సమావేశం

Mango News, PM Modi felicitates Indian paralympic contingent, PM Modi hosts India Paralympic contingent, PM Modi Hosts Indian Contingent of Tokyo 2020 Paralympic, PM Modi Hosts Indian Contingent of Tokyo 2020 Paralympic at his Residence, PM Modi hosts Indian para-athletes, PM Modi meets India’s Paralympians, pm narendra modi, PM Narendra Modi felicitates Indian paralympic contingent, PM Narendra Modi hosts India’s paralympic contingent, PM Narendra Modi hosts Indian paralympic contingent, Tokyo 2020 Paralympic

ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో-2020 పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లతో గురువారం ఉదయం అతిథ్య సమావేశం నిర్వహించారు. పారా అథ్లెట్‌ లతో పాటు కోచ్‌లు కూడా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ అథ్లెట్ల అందరితో సంభాషించారు. టోక్యో-2020 పారాలింపిక్ క్రీడలలో చారిత్రాత్మక ప్రదర్శన చేసినందుకు వారిని అభినందించారు. వారి విజయం దేశంలోని మొత్తం క్రీడా సమాజం యొక్క ధైర్యాన్ని గణనీయంగా పెంపొందిస్తుందని, వర్ధమాన క్రీడాకారులు క్రీడలను చేపట్టడానికి మరింత ముందుకు వచ్చేలా ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. పారా అథ్లెట్ల సంకల్ప శక్తి గొప్పదని, వారి జీవితంలో అధిగమించిన అసమానతలను దృష్టిలో ఉంచుఉంటే ఈ ప్రదర్శన ఎంతో ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు.

విజయం అందుకోలేని వారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తూ, నిజమైన క్రీడాకారుడు ఓటమి లేదా గెలుపుతో ఆగిపోకూడదని ముందుకు సాగుతూనే ఉండాలని పేర్కొన్నారు. పారా అథ్లెట్స్ దేశానికి రాయబారులని, వారు తమ అద్భుతమైన ప్రదర్శన ద్వారా ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచారని చెప్పారు. మరోవైపు పారా అథ్లెట్లు తమకు ఆహ్వానం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో ఒకే టేబుల్ వద్ద కూర్చోవడం పెద్ద విజయం అని అన్నారు. తమకు నిరంతరం మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు మద్దతు తెలిపిన ప్రధాని మోదీకి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక టోక్యో పారాలింపిక్-2020లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్ చరిత్రలోనే ఈసారి భారత్ అత్యధిక పతకాలు గెలుచుకుంది. భారత అథ్లెట్స్ మొత్తం 19 పతకాలు గెలుచుకోగా, అందులో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజత, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =