సచివాలయం కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి – సీఎం కేసీఆర్

CM KCR, KCR Review Meeting, KCR Review Meeting on New Secretariat Building Construction, New Secretariat Building Construction, Telangana New Secretariat, Telangana New Secretariat Building, Telangana New Secretariat Building Construction, Telangana Secretariat Building Construction

కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై జూలై 21, మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చాలని చెప్పారు.

ముందుగా సచివాలయ డిజైన్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారు. భవనంలో ఉండాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలుండాలని చెప్పారు. ప్రతీ అంతస్తులో ఒక డైనింగ్ హాలు, సమావేశ మందిరం ఉండాలని చెప్పారు. విఐపిలు, డెలిగేట్స్, డిగ్నిటరీస్, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు ఉండాలని చెప్పారు. సెక్రటేరియట్లో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకులుంటారు? తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =