తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక కోసం అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరుగుతుండగా, బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఈ రోజు నుంచే ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది.
హుజురాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – అక్టోబర్ 1
- నామినేషన్లకు ఆఖరితేదీ – అక్టోబర్ 8
- నామినేషన్ల పరిశీలన – అక్టోబర్ 11
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – అక్టోబర్ 13
- పోలింగ్ జరిగే తేదీ – అక్టోబర్ 30
- ఓట్ల లెక్కింపు – నవంబర్ 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ