జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్, ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్

AP Minister Perni Nani, janasena chief pawan kalyan, Mango News, Minister Perni Nani counters Pawan Kalyan’s tweet, Pawan Kalyan VS Perni Nani, Pawan Kalyan VS Perni Nani Tweets, Pawan Kalyan’s tweet, Telugu film body steers clear of Pawan Kalyan’s remarks, Transport Minister Perni Nani, Tweet Combat between Janasena Chief Pawan kalyan and AP Minister Perni Nani, Tweet Combat between Pawan kalyan and Perni Nani

ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, కొందరు మంత్రులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. కాగా వైసీపీ నేతల విమర్శలపై అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సోమవారం రాత్రి మరోసారి స్పందించారు. “తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే హూ లెట్ ద డాగ్స్ ఔట్ అనే సాంగ్ లింక్ ట్వీట్ చేస్తూ, ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికే ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఓ వీడియోనూ జత చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. “జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు” అని మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు.

ఓవైపు విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాతుండగానే పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 29 నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. 29న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో, అనంతపురం జిల్లాలో కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి–ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =