భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

JanaSena Chief Pawan Kalyan Conveyed Deepavali Greetings to All Indians

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. “దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలను రక్షించాలని ఈ దివ్వెల పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాను. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ హానికరం కానీ మందుగుండు సామగ్రితో దీపావళిని జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరం. కంటికి హాని చేసే క్రాకర్లకు దూరంగా ఉందాం. ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచండి. ఈ దీపావళిని ఆనందకేళిగా మలచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ