వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదా?

In Narasapuram Does YCP Even Get A Deposit?, YCP Even Get A Deposit, YCP Even Get A Deposit In Narasapuram, Narasapuram YCP, Narasapuram ,YCP, TDP,Janasena, YS Jagan, Pawan Kalyan, Chiranjeevi, Nagababu, Chandrababu, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Narasapuram ,YCP, TDP,Janasena, YS Jagan, Pawan Kalyan, Chiranjeevi, Nagababu, Chandrababu,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అన్న విషయం అందరికీ తెలుసు.చిరంజీవి నుంచి  పవన్ వరకూ అందరూ  అక్కడే పుట్టారు. అందుకే సొంత నియోజకవర్గం అంటే మెగా ఫ్యామిలీకి మెగా ప్రేమ అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. నరసాపురం నియోజకవర్గం లోని మొగల్తూరులోనే  మెగా ఫ్యామిలీ పుట్టారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ప్రజరాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009లో నరసాపురం పక్కనే ఉన్న పాలకొల్లు నుంచే పోటీ చేశారు.

2019లో జరిగిన  ఎన్నికల్లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. పక్కనే ఉన్న భీమవరంలో పోటీ చేస్తే ఇదే నరసాపురం పార్లమెంటు నుంచి కొణెదల నాగబాబు పోటీ చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో ఓటర్లు.. ఈ ముగ్గురు  అన్నదమ్ములను వివిధ కారణాలతో  అక్కున చేర్చుకోలేకపోయారు.  సినిమా వేరు, రాజకీయం వేరు అన్న అభిప్రాయం ఉన్నా కూడా.. ఈ ప్రాంతంలో మెగాభిమానులు , కాపు ఓటర్లు ఎక్కువే ఉండటంతో.. అప్పట్లో ప్రజారాజ్యం.. తర్వాత జనసేన  ఓడిపోయినా సరే ఓట్లు మాత్రం  భారీగానే  కొల్లగొట్టాయి. 2019 ఎన్నికల్లో జనసేన నరసాపురం అసెంబ్లీలో ఓడిపోయినా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది.

2019 లో అక్కడ టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి కేవలం 21 వేల ఓట్లు రావడంతో పాటు డిపాజిట్ రానీకుండా చేసింది పవనే అన్నది ఒప్పుకోక తప్పదు. అయితే అప్పుడు టీడీపీకి  డిపాజిట్ గల్లంతయ్యేలా చేసిన పవన్ జనసేన పార్టీ ఇప్పుడు వైఎస్సార్సీపీకి కూడా అలాంటి ఘోర పరాభవాన్నే మిగుల్చుతుందన్న లెక్కలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఆ ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసి కేవలం 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.

కానీ ఇప్పుడు మారిన సమీకరణాలతో ఇప్పుడు జనసేన బలానికి  తోడుగా  బీజేపీ,టీడీపీ బలం కూడా కలిసి వచ్చింది. పైగా అక్కడ జనసేన బీసీ సామాజికవర్గ అభ్యర్థికి  సీటు ఇచ్చింది. వైఎస్సార్సీపీ నుంచి క్షత్రియ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరాజు బరిలో నిలబడుతున్నారు. దీనికి తోడు ఈ సారి కాపులు, బీసీలు, శెట్టిబలిజలు, మత్స్యకారులు అందరూ జనసేన వైపే ఉంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ ముందు నుంచే ఆశలు వదిలేసుకుందన్న టాక్ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =