పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు

Mango News, Olympian badminton player PV Sindhu, Olympian Star shuttler P V Sindhu receives Padma Bhushan, Padma Awards, Padma Awards 2020, Padma Bhushan Award to Star Shuttler PV Sindhu, President Kovind, President Kovind Presented Padma Bhushan Award, President Kovind Presented Padma Bhushan Award to Star Shuttler PV Sindhu, Star shuttler PV Sindhu receives Padma Bhushan award, Two time Olympic Medalist PV Sindhu

దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ​లో ఘనంగా జరిగింది. 2020లో మొత్తం 118 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ వేడుకల్లో భాగంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంది.

అలాగే మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా, నేడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్‌ అవార్డును అందుకున్నారు. ఇక బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, సింగర్‌ అద్నాన్‌ సమీ, నిర్మాత కరణ్‌ జోహార్‌, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌ కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ