మరోసారి తెరపైకి ఈటల భూముల వ్యవహారం, ఈటల జమున, ఈటల నితిన్‌రెడ్డికి నోటీసులు

Etela Case, Etela Land Encroachment Case, Etela Land Encroachment Case News, Etela Land Encroachment Case Updates, Etela Rajender Land Encroachment Case, Jamuna Hatcheries, Land Encroachment Case, Mango News, Notice To Etela Jamuna Etela Nithin Reddy over Land Survey, Telangana High Court, Toopran RDO Sends Notice Etela Jamuna, Toopran RDO Sends Notice Etela Jamuna Etela Nithin, Toopran RDO Sends Notice Etela Jamuna Etela Nithin Reddy over Land Survey

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో సర్వే నంబర్‌ 130లో, హ‌కీంపేట‌లో సర్వే నంబర్‌ 97లో సర్వే చేపట్టడానికి సంబంధించి ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి తూప్రాన్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్ సర్వే సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈ భూముల సర్వేపై జూన్ మూడవ వారంలో నోటీసులు ఇవ్వడం జరిగిందని, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున సర్వే చేయడానికి వీలుపడలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన సర్వే నోటీసుకు ఫైల్స్ కు కొనసాగింపుగా అచ్చంపేట సర్వే నంబర్‌ 130లో ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 నుంచి, హ‌కీంపేట‌లో సర్వే నంబర్‌ 97లో ఈ నెల 18వ తేదీ ఉదయం 10.30 నుండి సర్వే చేయబడుతుందని, ఈ సర్వే సమయంలో నిర్ణిత ప్రదేశంలో హాజరుకావాలని ఈటల జమున, ఈటల నితిన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు జ‌మునా హ్యాచ‌రీస్ వ‌ద్ద అధికారులు నోటీసులు అంటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =