శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యూఎన్పీ నేత రణిల్ విక్రమసింఘే

Sri Lanka Economic Crisis Ranil Wickremesinghe Takes Oath as New Prime Minister of Sri Lanka, Ranil Wickremesinghe Takes Oath as New Prime Minister of Sri Lanka, Ranil Wickremesinghe Returns As Prime Minister, Ranil Wickremesinghe to take oath as new Sri Lanka Prime Minister, Ranil Wickremesinghe Sworn In As New PM Of SL, United National Party leader Ranil Wickremesinghe sworn in as the new Prime Minister of Sri Lanka, United National Party leader Ranil Wickremesinghe, UNP leader Ranil Wickremesinghe, Ranil Wickremesinghe, Sri Lanka Prime Minister, Ranil Wickremesinghe Sri Lanka Prime Minister, Prime Minister Of Sri Lanka, Prime Minister Of Sri Lanka Ranil Wickremesinghe, Sri Lanka Economic Crisis News, Sri Lanka Economic Crisis Latest Nrews, Sri Lanka Economic Crisis Latest Updates, Sri Lanka Economic Crisis Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక దేశ నూతన ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. 73 ఏళ్ల విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, నేడు బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తం 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటులో యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ తరపున విక్రమసింఘే ఒకేఒక సభ్యుడిగా ఉండడం, తాజాగా ప్రధాని పదవీ దక్కించుకోవడం విశేషం. అయితే విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా గతంలో నాలుగుసార్లు పనిచేశారు.

ప్రధానిగా మహింద రాజపక్సే రాజీనామా అనంతరం, శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో రణిల్ విక్రమసింఘే చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీలంక మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుమారుడు నమల్ రాజపక్సేతోపాటు మరో 15 మందిపై దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్టు గురువారం నాడు ప్రయాణ నిషేధం విధించింది. ఇక తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో శ్రీలంకలో విధించిన కర్ఫ్యూను తాత్కాలికంగా ఎత్తివేశారు. దీంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలతో వీధులు, ప్రజా రవాణా రద్దీగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =