పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. సెలవులను మినహాయించి దాదాపు 20 రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. కోవిడ్ అనంతరం జరిగిన ఇతర పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్స్ అనుసరించి శీతాకాల సమావేశాలు కూడా జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభలైన రాజ్యసభ, లోక్‌సభ ఒకే సమయంలో కార్యకలాపాలు నిర్వహించనుండగా, ఎంపీలంతా భౌతిక దూరం నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి కూడా ఎంపీలతో పాటుగా పార్లమెంట్ కు హాజరయ్యే ఇతరులు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, సమావేశాల ప్రారంభానికి ముందు కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవాలని కోరే అవకాశమునట్టు సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేంద్రప్రభుత్వం అధికారికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో తాజా పరిస్థితులు , పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు, పెగాసిస్ అంశం సహా ఇతర రాజకీయాల అంశాల దృష్ట్యా ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ