దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్: 109 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ

India’s Cumulative Covid-19 Vaccination Coverage Exceeds 109 Cr

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 109 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా, నవంబర్ 9, మంగళవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 109.08 కోట్లు (1,09,08,16,356) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా గత 24 గంటల్లోనే 59.08 లక్షలమందికి పైగా(59,08,440) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ముందుగా జూన్ 21, 2021 నుంచి కేంద్రప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు నెలలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75% కేంద్ర ప్రభుత్వం సమీకరించి రాష్ట్రాలకు/కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − one =