ప్రముఖ సంస్థ గూగుల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ కోవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని గూగుల్ హెచ్చరించింది. డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే, వారికి జీతాలు కట్ చేస్తామని, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో మరికొద్ది రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని.. అయినాసరే, వ్యాక్సిన్ పాలసీని మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయమై గూగుల్ యాజమాన్యం సిబ్బందికి మెమో జారీ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం తెలిపింది.
100 మంది సిబ్బందికి పైగా ఉన్న అమెరికా కంపెనీలన్నీ జనవరి 18 లోగా తమ ఉద్యోగులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని అమెరికా ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. 2022 జనవరి 18 నాటికి గూగుల్‌లోని ప్రతి ఒక్కరూ కంపెనీ వ్యాక్సినేషన్ రూల్స్‌ను పాటించాలని సంస్థ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా రూల్స్ పాటించని పక్షంలో.. ఒక నెల రోజులు వేతనంతో కూడిన సెలవులో పంపిస్తామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు వ్యక్తిగత సెలవులిచ్చి, దాని తర్వాత కంపెనీ నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. అయితే ఈ కథనంపై గూగుల్ అధికార ప్రతినిధి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ