భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన బంగ్లాదేశ్

50 years of Bangladesh, 50 Yrs of 1971 War, 50th Victory Day celebrations, Bangladesh Accords Red Carpet Welcome To India President Ram Nath Kovind, Bangladesh accords red carpet welcome to President, Bangladesh accords red carpet welcome to President Ram Nath Kovind, Bangladesh celebrates 50 years, Bangladesh invites President Kovind for 50th anniversary, Bangladesh Welcome To India President Ram Nath Kovind, Mango News, President Kovind begins 3-day visit to Bangladesh, President Ram Nath Kovind, Ram Nath Kovind

1971 లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. స్వాతంత్య్రం పొంది 50 వసంతాలైన సందర్భంగా జరుపుకుంటున్న విక్టరీ డే వేడుకలకు గౌరవ అతిథిగా భారతదేశం తరపున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరయ్యారు. కోవిడ్ వ్యాప్తి తరువాత రాష్ట్రపతి చేస్తున్న మొదటి పర్యటన ఇదే కావటం గమనార్హం. 3 రోజుల పర్యటన నిమిత్తం కుటుంబంతో సహా చేరుకున్న భారత రాష్ట్రపతికి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. సతీసమేతంగా విమానాశ్రయానికి విచ్చేసిన ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ భారత రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 50వ స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.

బంగ్లాదేశ్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ సవర్ లోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించుకుని, బంగ్లాదేశ్ విముక్తికోసం పోరాడి అమరులైన వీరులకు నివాళి అర్పించారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన బంగబంధు మెమోరియల్ మ్యూజియం సందర్శించి షేక్ ముజిబుర్ రెహ్మాన్ కు అంజలి ఘటించారు. 1971 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం వలన బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం లభించింది. అప్పటినుంచి బంగ్లాదేశ్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న భారత్, బాంగ్లాదేశ్ లో జరిగే వేడుకలకు హాజరవటం ఆనవాయితీగా వస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =