కెప్టెన్సీ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదు – కోహ్లీ

Dirty Politics, Kohli contradicts BCCI president’s statement, Mango News Telugu, Sourav Ganguly, Twitter slams Sourav Ganguly, Virat Kohli, Virat Kohli and Rohit Sharma Issue, Virat Kohli contradicts Sourav Ganguly, Virat Kohli Contradicts Sourav Ganguly’s Claims, Virat Kohli Contradicts Sourav Ganguly’s Claims Over Quitting T20I Captaincy, Virat Kohli refutes BCCI President Sourav Ganguly claim, Virat Kohli to step down as India T20I captain, Wasn’t told not to give up T20I captaincy

కెప్టెన్సీ విషయంలో మొదలైన గొడవ భారత క్రికెట్ ను కుదిపేస్తోంది. కెప్టెన్సీపై కోహ్లీని సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. వన్డేలకు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మని నియమించిన విషయం కూడా విదితమే. ఈ విషయంలో కినుక వహించిన కోహ్లీ, దక్షిణాఫ్రికా టూర్ కి వెళ్లటం లేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ రోజు విరాట్ మీడియా ముందుకు వచ్చాడు. వన్డే కెప్టెన్ గా తనని తప్పించే విషయం కేవలం గంటన్నర ముందే తనకి చెప్పారని తెలిపాడు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుందని క్రికెట్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

దక్షిణాఫ్రికా టూర్ కి వెళ్ళటం లేదని వస్తున్న వార్తలు అవాస్తవాలు అని విరాట్ కోహ్లీ స్పష్టం చేసాడు. నేను సెలెక్టర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. దక్షిణాఫ్రికాలో జరుగనున్న వన్డే సిరీస్ కి విరామం కావాలని నేను బీసీసీఐ ని అడగలేదు. అలాగే, వన్డే కెప్టెన్సీ విషయంలో కూడా నాకు సరైన సమాచారం ఇవ్వలేదు. టెస్ట్ జట్టుని ప్రకటించే కేవలం గంటన్నర ముందు నాకు ఈ విషయం తెలిసింది. కానీ, నేను బీసీసీఐ నిర్ణయాన్ని అర్ధం చేసుకోగలను. నేను కెప్టెన్ గా నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాను. జట్టుకు శాయశక్తులా పనిచేశాను. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో ఎలాంటి విభేదాలు లేవు, అని కోహ్లీ చెప్పాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =