పచ్చా పచ్చాని పల్లె అనే పుస్తకాన్నిఆవిష్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar Launches Pacha Pachani Palle Book Written by Juluri Gouri Shankar

దేశంలోనే పల్లెప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని, గ్రామ స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఇటీవల పదవీ భాద్యతలు స్వీకరించిన జూలూరు గౌరీ శంకర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను నేడు బీఆర్ కేఆర్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘పచ్చా పచ్చాని పల్లె’ అనే పుస్తకాన్ని సీఎస్ ఆవిష్కరించారు. సీఎస్ సమాట్లాడుతూ, పల్లె ప్రగతితో పల్లెల ముఖ చిత్రం మారిపోయిందని అన్నారు. పల్లెల ఆరోగ్యమే, దేశ సౌభాగ్యమని స్వచ్ఛ భారత్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతీ పల్లె సర్వ స్వతంత్ర కేంద్రంగా నిలవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనా ఎంతో దోహదం చేసిందన్నారు. స్ఫూర్తి దాయక పుస్తకాన్ని రచించిన జూలూరి గౌరీ శంకర్ ను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ