తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. 2022 నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు మరియు బార్లలో మద్యాన్ని విక్రయించే సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 31వ తేదీన మద్యం దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే డిసెంబర్ 31 మరియు జనవరి 1 వ తేదీల్లో బార్లలో, ఇన్-హౌస్ లైసెన్సస్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో నడిచే మద్యం దుకాణాల్లో, ఈవెంట్స్ పర్మిట్ ఉన్నవారు అర్థరాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా అన్ని చోట్ల కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నూతన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కు ఆదేశాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ