దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి: 781కు పెరిగిన కేసుల సంఖ్య

Union Ministry of Health Announced 781 Omicron Variant Cases, 781 Omicron Variant Cases Detected so far in the Country, Union Ministry of Health, 781 Omicron Variant Cases, Omicron Variant Cases in Country, Coronavirus News Updates: India’s Omicron tally rises to 781, Omicron LIVE Updates, Omicron Latest Updates, Omicron cases in India , Omicron tally in country rises to 781, Coronavirus Omicron Updates, omicron india cases today, total omicron cases in india today

కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు అనేక దేశాలకు విస్తరించింది. కాగా భారత్ లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా, అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 781 బాధితుల్లో ఇప్పటికే 241 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.

దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (781):

  1. ఢిల్లీ – 238
  2. మహారాష్ట్ర – 167
  3. గుజరాత్ – 73
  4. కేరళ – 65
  5. తెలంగాణ – 62
  6. రాజస్థాన్ – 46
  7. కర్ణాటక – 34
  8. తమిళనాడు – 34
  9. హర్యానా – 12
  10. వెస్ట్ బెంగాల్ – 11
  11. మధ్యప్రదేశ్ – 9
  12. ఒడిశా – 8
  13. ఆంధ్రప్రదేశ్ – 6
  14. ఉత్తరాఖండ్ – 4
  15. చండీఘర్ – 3
  16. జమ్మూ కాశ్మీర్ – 3
  17. ఉత్తర్ ప్రదేశ్ – 2
  18. గోవా – 1
  19. హిమాచల్ ప్రదేశ్ – 1
  20. లద్దాఖ్ – 1
  21. మణిపూర్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =