సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌

Indian Star Shuttler Kidambi Srikanth Meets AP CM YS Jagan Today, Mango News, Mango News Telugu, Indian Star Shuttler Meets AP CM YS Jagan, Kidambi Srikanth Meets AP CM YS Jagan, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, AP CM YS Jagan congratulated Kidambi Srikanth for winning, Indian shuttler Kidambi Srikanth, Kidambi Srikanth, Indian Star Shuttler Kidambi Srikanth, AP CM YS Jagan, Kidambi Srikanth Silver medal win at World Championships, World Championships 2021, Badminton World Championships, kidambi srikanth wins silver medal

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కిదాంబి శ్రీకాంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిదాంబి శ్రీకాంత్‌ ను సీఎం వైఎస్‌ జగన్‌ ఘనంగా సత్కరించారు. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత్ తరపున ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచిన శ్రీకాంత్ కు రాష్ట్రప్రభుత్వం తరపున రూ.7 లక్షల నగదు బహుమతితో పాటుగా అకాడమీ ఏర్పాటు కోసం తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు శ్రీకాంత్‌ ఇప్పటికే ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, సీఎం జగన్ ను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. స్పోర్ట్ విషయంలో ఏ అవసరం వచ్చినా చేశారని, చాలా మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ