నూతన సంవత్సరం సందర్భంగా శనివారం.. గవర్నరు తమిళిసై మరియు హోంమంత్రి మహమూద్ అలీ లతో అట్టహాసంగా ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆదివారానికి నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసు శాఖ అధికారులు రాత్రి 10 గంటల సమయంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులకు ఫోన్ చేసి నిలిపివేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సుమారు 10వేల మంది వరకు సందర్శకులు ఉన్నట్లు సమాచారం. అయితే, పోలీసుల ఆదేశాల నేపథ్యంలో.. ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న మైకుల ద్వారా సందర్శకులను వెంటనే బయటకు వెళ్లి పోవాల్సిందిగా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు విన్నవించారు. దీనితోపాటు, ఎగ్జిబిషన్లోని స్టాల్స్ నిర్వాహకులకు కూడా తెలియజేసి స్టాల్స్ ను మూసివేయించారు. మొదటి రోజున స్వల్పంగా హాజరైన సందర్శకులు, రెండవరోజైన ఆదివారం మాత్రం పది వేల మందికి పైగా రావటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ