ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ భారీ వర్షంతో.. కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ సెంటర్‌లో ఉన్న 70 అడుగుల ఎత్తైన శ్రీ రాముడి పట్టాభిషేక లైటింగ్ కటౌట్ కూలిపోయింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని.. రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ వర్షం దెబ్బకు నేలకొరిగింది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో వెళ్తున్న వారిని రాత్రి వేళల్లో ఈ కటౌట్ బాగా ఆకట్టుకుంటోంది.
ఆలయ కమిటీ అధికారులు సుమారు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అయితే, ఇది కూలిపోయే సమయంలో దగ్గరలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ నేలకొరిగింది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానుకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం, జమ్మికుంట మండలలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీడయంతో సిరిసిల్ల విద్యానగర్‌లో విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ