ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచిన కేంద్రం

2022, CBDT extends due dates for filing of Income Tax Return, CBDT extends Income Tax Filing deadline, CBDT extends income tax return filing deadline, Due date for filing income tax returns for assessment year, Income Tax Return Filing Date Extended up to 15 March, Income Tax Return Filing Date Extended up to 15 March 2022, Income tax return filing deadline extended, Income Tax Return filing deadline extended to March 15, Income Tax Returns Deadline Extended To March 15, Mango News

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్నుల దాఖలు గడువును మరో 2 నెలలు, అంటే.. 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ఓ ట్వీట్ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో.. పన్ను చెల్లింపుదారులు మరియు సంబంధిత ఇతరులు కోరిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కోవిడ్-19 మహమ్మారితో పాటు, ఆడిట్ రిపోర్టులను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది.

ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన కొత్త వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తటం కూడా ఒక కారణమని తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి గడువును పెంచటం విశేషం. దీంతో.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =