దళిత బంధు అమలుపై మంత్రి కొప్పుల, సీఎస్ సమీక్ష, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు

CS Somesh Kumar Held Review on Implementation of Dalit Bandhu, Dalit Bandhu, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme In Telangana, dalit bandhu scheme upsc, dalitha bandhu telangana amount, dalitha bandhu telangana eligibility, dalitha bandhu telangana scheme, dalitha bandhu telangana scheme apply online, dalitha bandhu telangana scheme details, implementation of Dalit Bandhu, Koppula Eshwar Review on Implementation of Dalit Bandhu, Mango News, Minister Koppula Eshwar, Review on Implementation of Dalit Bandhu, Telangana govt gears up to implement dalit bandhu

రాష్ట్రంలో దళితబంధు అమలును వేగవంతం చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు శనివారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం కార్యాలయం కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ.కరుణాకర్ లు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దళిత బంధు అమలుపై జిల్లా కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకం చెప్పారు. దళిత బంధు కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల కేటాయింపు జరిగిందని, ఇప్పటికే వాసాల మర్రి, హుజురాబాద్ లలో దళిత బంధు అమలు లో ఉందన్నారు. అలాగే ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.

దళిత బంధు అమలుపై జిల్లా కలెక్టర్లకు జారీచేసిన కీలక ఆదేశాలు ఇవే:

  • రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ఈ పధకం అమలు చేయాలని నిర్ణయం.
  • ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలోపు 100 శాతం గ్రౌండింగ్ చేయాలి.
  • స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలి.
  • ప్రతీ లబ్ది దారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేత.
  • లబ్దిదారుడు కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలి.
  • ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 3 =