యూపీ ఎన్నికలలో ‘కర్హాల్‌’ నుంచి బరిలోకి దిగనున్న అఖిలేష్

2022 UP assembly election, 2022 Up Assembly Elections, Akhilesh Yadav, Akhilesh Yadav To Contest From Karhal Seat, Akhilesh Yadav To Contest From Karhal Seat In Mainpuri, Akhilesh Yadav To Contest From Karhal Seat In Mainpuri District, Mango News, SP Chief Akhilesh Yadav to be Contest First Time in UP Assembly Election, UP assembly election 2022, UP Assembly Elections 2022, Up Assembly Polls, UP Election, UP Election 2022, UP Election Fight, UP Elections, UP Elections 2022, UP Elections 2022 Latest Update, Yogi Adityanath UP Assembly Elections

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు తెరపడింది. మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ శనివారంనాడు అధికారికంగా ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌పాల్ యాదవ్ ఈ ప్రకటన చేశారు. అఖిలేష్ యాదవ్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనుండటం విశేషం. ఉత్తరప్రదేశ్ లో గత ఎన్నికలలో అధికారం కోల్పోయిన ఎస్పీ పార్టీకి ఈసారి గెలుపు ఎంతైనా అవసరం. అందుకే, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని, వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని, 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అఖిలేష్ హామీలు ఇస్తున్నారు.

దశాబ్దానికి పైగా మైన్‌పురి జిల్లా సమాజ్‌వాదీ పార్టీ కి కంచుకోటగా నిలుస్తుండగా, మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్‌కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు. అఖిలేష్ ప్రస్తుతం.. అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అజాంగఢ్ ప్రజలు కోరితే పోటీలోకి దిగుతానంటూ అఖిలేష్ తన పోటీపై ఇటీవల సంకేతాలు ఇచ్చారు. తాజాగా, తమ కుటుంబానికి మంచి పట్టున్న మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =