మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud Launches Helicopter Services for Medaram Maha Jathara

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన శ్రీ సమ్మక్క–సారలమ్మల మహాజాతర నేటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజంలో భాగంగా పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంబించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి హైదరాబాద్ , కరీంనగర్, మహబూబ్ నగర్ పట్టణాల నుండి హెలికాప్టర్ లో మేడారంకు వెళ్లే పర్యాటకుల కోసం అందించే సేవలపై రూపొందించిన బ్రోచరును కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టూరిజం ఎండీ మనోహర్, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం అధికారులతో కలిసి మేడారం వెళ్లే హెలికాప్టర్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

మేడారంకు హెలికాప్టర్ లో వెళ్లేందుకు పర్యాటకులు 09880505905 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. మధ్య తరగతి ప్రజలకు నామమాత్రపు ధరతో జాలి రైడ్ ప్యాకేజీని రూపొందించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజంను రాష్ట్రంలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. మేడారంకు హెలికాప్టర్ సేవలు ఫిబ్రవరి 20, 2022 వరకు అందించనున్నామని తెలిపారు. హెలికాప్టర్ జాయ్ రైడ్ లో భాగంగా 7,8 నిమిషాలు మేడారం నుండి మేడారం జాతర వ్యూ కోసం ఒక్క వ్యక్తి కి రూ.3700 ఛార్జ్ ఉంటుందని అన్నారు. మేడారం షటిల్ సర్వీస్ లో భాగంగా హనుమకొండ నుండి మేడారం 20 నిమిషాల వన్ వే రైడ్ కోసం ఒక్క వ్యక్తికి రూ.19,999 చార్జీ ఉంటుందని చెప్పారు.

హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ వివరాలు:

  • హైదరాబాద్ నుండి మేడారం : ప్రతి వ్యక్తికి రూ.75,000
  • కరీంనగర్ నుంచి మేడారం : ప్రతి వ్యక్తికి రూ.75,000
  • మహబూబ్ నగర్ నుండి మేడారం : ప్రతి వ్యక్తికి రూ.1,00,000
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =