అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Crop Damage Compensation to Farmers, Crop Damage Compensation to Farmers Telangana, Farmers, Mango News, Pay relief to farmers for crop loss, Revanth Reddy, Revanth Reddy demands compensation to farmers, Revanth Reddy Writes a Letter to CM KCR, TPCC President Revanth Reddy, TPCC President Revanth Reddy Writes a Letter to CM KCR, TPCC President Revanth Reddy Writes a Letter to CM KCR over Crop Damage Compensation, TPCC President Revanth Reddy Writes a Letter to CM KCR over Crop Damage Compensation to Farmers, TPCC Writes Open Letter To CM KCR

తెలంగాణ రాష్ట్ర ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులకు ఒక ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మిగతా పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని చెప్పారు. అలాగే తామర తెగులు కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు తెగుళ్ల కారణంగా రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో దాదాపు 8,633 కోట్ల రూపాయల విలువైన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసినట్లు తెలిపారు. రైతులు ఎకరాకు దాదాపు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారని, ఎకరాకు దాదాపు 25 క్వింటాళ్ల దిగుబడితో దాదాపు రూ.3.50 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారన్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు పంటలను నాశనం చేయడంతో 25-30 క్వింటాళ్లు బదులు, మూడు క్వింటాళ్ల లోపు దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, లేకుంటే కాంగ్రెస్‌ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here