ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందబోతోంది. కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాల పేర్లను కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. అయితే, అప్పుడప్పుడు రాష్ట్రంలోని పలు సమస్యలపై తనదైన శైలిలో లేఖాస్త్రాలు సంధించటం మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభంకు అలవాటు. ఇప్పుడు తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై కూడా తన స్పందనని తెలియజేశారు ముద్రగడ.
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు ముద్రగడ పద్మానాభం. కొత్తగా ఏర్పాటు అవుతున్న జిల్లాలలో 3 జిల్లాలకు తాను సూచిస్తున్న పేర్లు పెట్టాలని ముద్రగడ విన్నవించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాకు ‘బాబా సాహెబ్ అంబేద్కర్’ పేరును పెట్టాలని కోరారు ముద్రగడ. అలాగే, రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు ‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక, కోనసీమ జిల్లాకి లోక్ సభ మాజీ స్పీకర్ స్వర్గీయ ‘బాలయోగి’ పేరు పెట్టాలని తన లేఖలో సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ