మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ కు మళ్ళీ కరోనా పాజిటివ్

CM Shivraj Singh Chouhan Tests Positive for COVID-19, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, Madhya Pradesh CM, Madhya Pradesh CM Shivraj Singh, Madhya Pradesh CM Shivraj Singh Chouhan Tests Positive, Madhya Pradesh CM Shivraj Singh Chouhan Tests Positive for COVID-19, Mango News, Shivraj Singh, Shivraj Singh Chouhan Tests Positive, Shivraj Singh Chouhan Tests Positive for COVID-19

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. నాకు సాధారణ లక్షణాలు ఉన్నాయి. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నాను. రాబోయే అన్ని పనులను వర్చువల్ విధానంలో నిర్వహిస్తాను. బుధవారం (ఫిబ్రవరి 16) జరగనున్న సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా వర్చువల్ గా పాల్గొంటాను. అలాగే గత కొన్ని రోజులుగా నాతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు, ఇటీవల నాతో సంప్రదించిన వారంతా వెంటనే ఇతరులతో వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ ట్వీట్ చేశారు.

కాగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్ కోవిడ్-19 వైరస్ బారినపడడం ఇది రెండోసారి. గతేడాది జూలైలో చౌహాన్‌ కు మొదటిసారి కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 10,27,651 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 10,00,025 మంది కోలుకున్నారు. కోవిడ్ వలన 10,697 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం 16,929 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ