తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలి – మంత్రి హరీశ్ రావు

Covid vax drive for 15 years to 18 years in Telangana, Harish Rao Launches Children COVID-19 Vaccination Drive, Harish Rao launches Covid vaccination drive for 15 to 18 years, Harish Rao launches Covid vax drive for 15 years to 18 years in Telangana, Harish Rao launches COVID-19 vaccine for children, Mango News, Minister Harish Rao launches vaccination drive for 15-18 age group, Telangana Health Minister, Telangana Health Minister launches COVID-19 vaccination, Telangana Health Minister T Harish Rao, Telangana Health Minister T Harish Rao Launches Children COVID-19 Vaccination Drive, Telangana Health Minister T Harish Rao Launches Children COVID-19 Vaccination Drive In State

తెలంగాణ రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయస్సు పిల్లలకు సోమవారం ఉదయం కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని బంజారాహిల్స్‌ యూపీహెఛ్సీలో జరిగిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. రెండో డోసును నాలుగు వారాల తర్వాత అందిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా మళ్ళీ కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, గత వారం రోజుల్లో దేశంతో పాటు రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4 రేట్లు పెరిగిందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు కేటగిరి కోసం 1014 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, తల్లి తండ్రులు లేదా ఉపాధ్యాయులు, డాక్టర్ల సమక్షంలోనే వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లలో కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో నేరుగా వాక్ ఇన్ పద్దతిలో వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత రద్దీని పరిశీలించి హైదరాబాద్, 12 కార్పోరేషన్లలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పై సమీక్షిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్స్ 15-18 ఏళ్ల పిల్లల వాక్సిన్ తీసుకునేలా బాధ్యత తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 4 =