తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ