తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Telangana CM KCR Birthday PM Modi and Several Political Leaders Celebrities Extends Wishes, Telangana CM KCR Birthday, PM Modi and Several Political Leaders And Celebrities Extends Wishes, PM Modi and Several Political Leaders Extends Wishes, Celebrities Extends Wishes, Telangana CM KCR, Telangana CM KCR Turns 68 On February 17, KCR Turns 68 On February 17, CM KCR Turns 68 On February 17, B'day Wishes Pour, Chief Minister of Telangana K Chandrashekar Rao Turns 68 On February 17, Chief Minister of Telangana K Chandrashekar Rao, K Chandrashekar Rao Turns 68 On February 17, Chief Minister of Telangana KCR Turns 68 On February 17, Prime Minister Narendra Modi extended birthday wishes to KCR, Prime Minister Narendra Modi, Prime Minister, Narendra Modi, KCR B'day, CM KCR B'day, Chief Minister of Telangana KCR B'day, KCR, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Chandrashekar Rao Turns 68 On February 17, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు 68వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు జాతీయ రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను 15,16,17 తేదీల్లో మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. 15, 16వ తేదీల్లో అన్నదాన కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీతో పాటుగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇక నేడు సీఎం కేసీఆర్ జన్మదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =