టిఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు

Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Goverment, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana State Road Transport Corporation, TSRTC Employees Retirement Age, TSRTC Latest News, TSRTC Retirement Age
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ బుధవారం నాడు సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. పదవీ విరమణ వయస్పు 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు పెంచిన సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసి అధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

[subscribe]