రైతుబంధు పంపిణీ : నాలుగు రోజుల్లో మొత్తం రూ.4246.68 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

Mango News, Rs 4246.68 Cr Deposited in Accounts of 52.71 Lakh Farmers in Four Days, Rythu Bandhu, Rythu Bandhu Cheques, Rythu Bandhu Distribution, Rythu Bandhu Distribution Rs 1302.6 Cr Deposited in Accounts of 10.51 Lakh Farmers Today, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme Amount, Rythu Bandhu Scheme in Telangana, Rythu Bandhu Scheme Latest News, Rythu Bandhu Scheme Money, Rythu Bandhu Telangana, telangana, telangana agriculture minister, Telangana Agriculture Minister Niranjan Reddy, Telangana Rythu Bandhu, TRS Government

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నాలుగోరోజైన డిసెంబర్ 31, శుక్రవారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం నాడు మొత్తం 6,75,824 మంది రైతుల ఖాతాలలో రూ.1144.64 కోట్లు జమచేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో మొత్తం 52,71,091 మంది రైతులకు, రూ.4246.68 కోట్ల రైతుబంధు నిధులు పంపిణీ జరిగిందని మంత్రి తెలిపారు.

ఆరుతడి పంటలతో అధిక లాభాలు వస్తాయని, సాంప్రదాయ సాగు నుండి రైతులు బయటకు రావాలని మంత్రి అన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ను పరిశీలించి సీజన్ కు ముందు రైతులకు సాగు చేయాల్సిన పంటల వివరాలు అందిస్తామన్నారు. అలాగే పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించిందని, దానికి తగినట్లే మద్దతుధరకు మించి మార్కెట్ ధర పలుకుతుందన్నారు. తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైనది, దానికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. పప్పు, నూనెగింజల సాగు మరింత పెరగాలి. వ్యవసాయ రంగానికి దేశంలో ఏ ప్రభుత్వం అందించనటువంటి సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 3 =