గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంబీబీఎస్ విద్యార్థిని ఫీజుల బాధ్యత తీసుకుంటూ భరోసా

MLC Kavitha Extends Financial Assistance to Student Harika From Nizamabad for her MBBS Education,MLC Kavitha Financial Assistance,Harika From Nizamabad,MBBS Education Financial Assistance,Mango News,Mango News Telugu,Harika MBBS Student Nizamabad,Harika MBBS Student,MLC Kavitha Harika MBBS Student,Harika MBBS Student,MLC Kavitha latest News And Updates,MLC Kavitha,TRS Party

టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా, నాందేవ్‌గూడకు చెందిన హారిక అనే విద్యార్థికి ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగా ఎంబీబీఎస్ విద్యార్థిని హారిక, ఆమె తల్లిని బుధవారం ఎమ్మెల్సీ కవిత కలుసుకున్నారు. ఈ సందర్భంగా హారికకు మొదటి ఏడాదికి సంబంధించిన కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో ఎమ్మెల్సీ కవిత అందించారు. ముందుగా ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ, హారిక తన ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేని పరిస్థితిలో ఉండడంతో ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఆమె చదువు సాగేలా తక్షణమే స్పందించి, సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ, కలలు కనే ధైర్యం చేయండి మరియు మీరు వాటిని సాధించే వరకు పనిని ఆపకండని పేర్కొన్నారు. “యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రాణించిన హారిక కథ ఇది. నేను ఆమెను మరియు ఆమె తల్లిని కలుసుకున్నాను మరియు ఆమె ఫీజు యొక్క మొదటి విడతను అందజేయడం ద్వారా ఆమె కలల పట్ల నా మద్దతును అందించాను. నిజామాబాద్‌కు చెందిన హారిక తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది. హారిక తమ కలలను సాకారం చేసుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కానుంది. ఈ క్రమంలో హారిక మరియు ఆమె తల్లిని కలవడం మరియు ఆమె అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడం నిజంగా  సంతోషకరం” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =