నేడు (శనివారం) వైఎస్సార్‌సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి అదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యాశాఖామంత్రి మంత్రి అదిమూలపు సురేష్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ సమర్థుడైన నాయకుడు అని, ఆయన సారధ్యంలో అందరం కలిసి పనిచేసి పార్టీని పదికాలాల పాటు కాపాడుకుందామని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ