హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana Lays Foundation For International Arbitration and Mediation Centre in Hyderabad, CJI NV Ramana Lays Foundation For International Arbitration and Mediation Centre, CJI NV Ramana, CJI NV Ramana Lays Foundation For IAMC, CJI NV Ramana Lays Foundation For IAMC in Hyderabad, Foundation For IAMC in Hyderabad, IAMC, International Arbitration and Mediation Centre, India's first International Arbitration and Mediation Centre in Telangana, Mediation Centre in Telangana, International Arbitration in Telangana, International Arbitration and Mediation Centre in Telangana, Ramana, CJI inaugurates IAMC in Hyderabad, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న విశాల స్థలంలో ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్‌ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఈరోజు ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సరి అయిన మధ్యవర్తిత్వం కారణంగా చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నా ప్రగాఢ విశ్వాసం అని సీజేఐ తెలిపారు. హైదరాబాద్‌లో ఆల్రెడీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఉన్నదని చెప్పారు.  హైదరాబాద్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రపంచ ఖ్యాతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగపూర్‌ మాదిరిగా హైదరాబాద్‌ కూడా మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఐఏఎంసీ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని ప్రశంసించారు. అంతేకాకుండా.. దీని నిర్మాణం కోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీ‌శ్‌‌చంర్‌ద‌శర్మ, ఐఏ‌ఎంసీ ట్రస్టీ‌లుగా ఉన్న స్రుపీం‌కోర్టు న్యాయ‌మూ‌ర్తులు జస్టిస్‌ లావు నాగే‌శ్వర్‌‌రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ పాల్గొన్నారు. ప్రభత్వం తరఫునుంచి మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రక‌ర‌ణ్‌‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి తది‌త‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 16 =