‘జగనన్న విద్యా దీవెన పథకం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్ల జమ

AP CM YS Jagan Mohan Reddy Released Jagananna Vidya Deevena Scheme Funds Today, Jagananna Vidya Deevena Scheme Funds Released Today, Jagananna Vidya Deevena Scheme Funds Released, AP CM YS Jagan Mohan Reddy Released Jagananna Vidya Deevena Scheme Funds, CM YS Jagan Mohan Reddy Released Jagananna Vidya Deevena Scheme Funds, Chief Minister of Andhra Pradesh Released Jagananna Vidya Deevena Scheme Funds, AP CM YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, CM YS Jagan, Jagananna Vidya Deevena Scheme, Jagananna Vidya Deevena Scheme Latest News, Jagananna Vidya Deevena Scheme Latest Updates, Jagananna Vidya Deevena Scheme Live Updates, Mango News, Mango News Telugu,

ఈరోజు జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఈ సదర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని తెలిపారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం లభిస్తుందని తెలిపారు. ఆర్ధిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థి చదువుకి దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యాదీవెనతో పాటు ‘వసతి దీవెన’ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. వసతి దీవెన డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లోకి వేస్తామని, రెండో విడత వసతి దీవెన ఏప్రిల్‌ 5న విడుదల చేస్తాం అని సీఎం జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =