ఎన్నికల్లో ఓడిన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామా కోరిన సోనియా గాంధీ, తన రాజీనామా లేఖను పంపిన సిద్ధూ

Sonia Gandhi Asks PCC Chiefs of Five States To Resign Navjot Singh Sidhu Send His Resignation Letter, Sonia Gandhi Asks PCC Chiefs of Five States To Resign, PCC Chiefs of Five States To Resign, Navjot Singh Sidhu Send His Resignation Letter, Navjot Singh Sidhu Send His Resignation Letter To Sonia Gandhi, PCC Chiefs of Five Poll Bound States, Congress Presidents In Poll Bound States Asked To Resign Sonia Gandhi, Sonia Gandhi Asked To Resign Congress Presidents In Poll Bound States, Congress Presidents In Poll Bound States, Poll Bound States, Congress Presidents, Sonia Gandhi, President of Indian National Congress, Sonia Gandhi President of Indian National Congress, Indian National Congress, INC, Sonia Gandhi the interim President of the Indian National Congress, INC presidents in all the 5 poll-bound states, Sonia Gandhi asked the INC presidents in all the 5 poll-bound states to submit their resignations, 5 poll bound states, Uttarakhand, Uttar Pradesh, Manipur, Punjab, Goa, PCC Presidents of Uttar Pradesh, PCC Presidents of Manipur, PCC Presidents of Goa, PCC Presidents of Punjab, PCC Presidents of Uttarakhand, Mango News, Mango News Telugu,

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలలో పోటీ చేసిన ఆయన కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాలైంది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం ఓ రకంగా షాక్ కి గురిచేసింది. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) చేతిలో దారుణ పరాజయం పాలైంది.

పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా తెలిపారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్‌ పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గణేశ్‌ గోడియాల్‌ కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్ధూ, ఉత్తరాఖండ్ రాష్ట్ర యూనిట్ చీఫ్ గణేష్ గోడియాల్ మరియు మణిపూర్ కౌంటర్ ఎన్ లోకేన్ సింగ్ అందరూ పిసిసి అధ్యక్షులుగా నియమితులయ్యారు. మంగళవారం, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయానికి గల కారణాలపై మేధోమథనం చేసిన సిడబ్ల్యుసి పార్టీని ప్రక్షాళన చేయాలనీ భావించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =