హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ – పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLAs Prajaswamya Parirakshana Deeksha Begins Today At Indira Park, Prajaswamya Parirakshana Deeksha Begins Today At Indira Park, BJP MLAs Prajaswamya Parirakshana Deeksha Begins, Indira Park, Prajaswamya Parirakshana Deeksha, BJP MLAs Prajaswamya Parirakshana Deeksha, Prajaswamya Parirakshana Deeksha At Indira Park, BJP MLAs Prajaswamya Parirakshana Deeksha At Indira Park, Bharatiya Janata Party, BJP, Bharatiya Janata Party MLAs, Prajaswamya Parirakshana Deeksha Latest News, Prajaswamya Parirakshana Deeksha Latest Updates, Prajaswamya Parirakshana Deeksha Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు బీజేపీ ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్‌ తిరస్కరించడంపై తమ నిరసన తెలపటానికి బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేపట్టారు. కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగం లేకుండానే సభను నడపటంతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో, బ‌డ్జెట్ ప్రసంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంగా ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు లను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను కేవలం వారం రోజులే నిర్వహించారని తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అధికారం ముఖ్యమంత్రి, స్పీకర్​కు ఉండదని ఈ సందర్భంగా ఈటల అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 8 =