తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలైంది. 2022 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 6 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 27 వరకు స్వీకరించనున్నారు. జులై 27, 28వ తేదీల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, కోదాడ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, నిజామాబాదు వంటి 10 రీజినల్ ఆన్‌లైన్ సెంటర్లలో, అలాగే ఏపీలో విజయవాడ, తిరుపతి, కర్నూల్, విశాఖపట్నం రీజియన్ సెంటర్లలో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.
టీఎస్ ఐసెట్-2022 పరీక్షషెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల: మార్చి 30
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 6
- దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : జూన్ 27
- ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 11
- ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 18
- ఆలస్య రుసుము రూ.1000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 23
- ఐసెట్ పరీక్ష నిర్వహణ తేదీలు : జులై 27, 28
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































