టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు విడుదల, మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే…

Manabadi TS EAMCET Result 2021 LIVE Updates, Mango News, Telangana EAMCET-2021 Results, Telangana EAMCET-2021 Results Declared, Telangana EAMCET-2021 Results Declared Today, Telangana State EAMCET 2021 Results, Telangana State EAMCET 2021 Results Announced Today, TS EAMCET 2021 Result declared, TS EAMCET Result 2021 to be declared, TS EAMCET Result 2021 to be declared today, TS EAMCET Results, TS EAMCET results 2021

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టీఎస్ ఎంసెట్-2021 ఫలితాలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంసెట్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 28 వేల మంది విద్యార్థులు అధికంగా ఎంసెట్ పరీక్ష రాశారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షకు 1,47,991 మంది విద్యార్థులు హాజరుకాగా, 82.08 శాతం మంది అర్హత సాధించారని, అలాగే అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు 79,009 మంది విద్యార్థులు హాజరుకాగా, 92.48 శాతం మంది అర్హత సాధించారన్నారు. విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇక ఇంజినీరింగ్‌ లో పశ్చిమగోదావరికి చెందిన కార్తికేయ మొదటి ర్యాంకును, కడపకు చెందిన వెంకట ప్రణీష్ రెండో ర్యాంకును, హైదరాబాద్‌ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ మతీన్ మూడో ర్యాంక్‌ ను కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌ అండ్ ఫార్మాలో హైదరాబాద్‌ బాలానగర్ కు చెందిన మండవ కార్తికేయ మొదటి ర్యాంకు, రంగారెడ్డి పెద్ద అంబర్ పేటకు చెందిన ఎమాని శ్రీనీజ రెండో ర్యాంకు, హైదరాబాద్‌ కూకట్ పల్లికి చెందిన కౌశల్‌ రెడ్డి మూడో ర్యాంకును సాధించారు. మరోవైపు టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఇప్పటికే ప్రకటించింది.

టీఎస్‌ ఎంసెట్-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 11 వరకు
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 13 వరకు
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – సెప్టెంబర్ 13
  • మొదటి విడత సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 15
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =